మంత్రులపై జగన్ అసహనం…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఈ తరుణంలో మంత్రులు అందరూ కూడా ఆదేశాలు లేకుండానే స్వచ్చందంగా ముందుకి వచ్చి పని చెయ్యాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినపడుతుంది. కాని ఏపీ మంత్రులలో ముగ్గురు నలుగురు మినహా ఎవరూ ముందుకి రావడం లేదు.

చాలా మంది మంత్రులు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. కాని కొంత మంది మంత్రులు మాత్రం చాలా నిదానంగా ఉన్నారని అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనే అసహనం జగన్ లో వ్యక్తమవుతున్నాయి. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో జగన్ కూడా వారిపై అసహనంగానే ఉన్నారు.

మంత్రులు బయటకు రాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎవరి జిల్లాను వాళ్ళు చూడాల్సిన అవసరం ఉందని, ఎమ్మెల్యేలకు మార్గ నిర్దేశనం చెయ్యాల్సిన అవసరాలు ఉన్నాయని ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూనే ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రుల తీరుపై ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు. కొంత మంది మంత్రులను మంత్రి వర్గం నుంచి తప్పించే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news