రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు సీఎం జగన్. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరవుతారు. ఆ తరువాత.. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు దాకమర్రి చేరుకుని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు సీఎం జగన్.
అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్న సీఎం, ఆ తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. నూతన దంపతులను ఆశీర్వదించిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు నేరుగా మంగళగిరి చేరుకోనున్నారు సీఎం జగన్… సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్న ఆయన.. నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం.. తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.