బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బలమైన కేంద్రం, బలహీనమై రాష్ట్రాలు అని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాన వచ్చిన తర్వాత పెట్రోల్, డిజిల్ ధరలు పెంచలేదని.. కానీ కేంద్రం రోజుకు ధరలు పెంచుతుందని విమర్శి్ంచారు. రాష్ట్రాలు టాక్స్ తగ్గించాలని చెబుతున్నారని… మీ జేబులు నిండాలి, రాష్ట్రాలు దివాళా తీయాలని చూస్తుందని అన్నారు. ఇది ఫెడరల్ సమాఖ్యకు పూర్తిగా విరుద్ధమైన దిక్కుమాలిన సిద్ధాంతం అని అన్నారు. ప్రజాస్వామ్యం పెరిగిన దేశాల్లో సెంట్రల్ నుంచి రాష్ట్రాలకు అధికారాలు బదిలీ అవుతుంటాయని.. కానీ బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే సిద్దాంతంతో బీజేపీ వెళ్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. నువ్వు రేట్లు పెంచుకుండా ఉండీ తగ్గించాలని కానీ మమ్మల్ని తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. పుడ్ సెక్యురిటీ కేంద్రంపై ఉన్నా.. వెన్నుచూపుతూ పారిపోతుందని విమర్శించారు. కేంద్రం పచ్చి అబద్దాలు మాట్లాడుతుందని విమర్శించారు. ఈ భారత ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని నేను ఢిల్లీలో దీక్ష చేపట్టానని అన్నారు.
బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం: సీఎం కేసీఆర్
-