యాదాద్రి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పర్యటించారు. యాదాద్రి ప్రధాన ఆలయం లో స్వామివారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజార్లు. అనంతరం కెసిఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో సీఎం కేసీఆర్ మరియు ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు కేసీఆర్ దంపతులు. దూరుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఉఘటన క్రతువు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీ సంతోష్ ఉన్నారు.