టీ కాంగ్రెస్‌ నేతల్లో ఒక్క మొగోడు లేకుండెనా : కేసీఆర్‌

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు మిర్యాలగూడలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ.. ‘నాతో కలిసి మిర్యాలగూడ నుంచి వచ్చిన యువకులు ఉన్నారు. సార్‌ 60-70వేల మంది వచ్చినమ్‌.. ఏం అయితది సార్‌ తూము ఇప్పాలంటే.. నేను చెప్పినా.. తూములు ఇప్పితే నీళ్లు రావు.. పోలీసులు వస్తారు.. తెలివి కావాలే.. నీకు ఎందుకు.. తెల్లారే వరకు నీరు వస్తాయని చెప్పాను. చెప్పినట్లుగానే తెల్లారే వరకు నీళ్లు వదిలారు. నేను ఏమంటున్నామంటే.. గులాబీ జెండా ఎగిరినంక టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతి విషయంలో కొట్లాడారే తప్పా.. ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు కొట్లాడలేదు? నీళ్లు ఇస్తవా.. రాజీనామా చేయమంటవా అంటే దెబ్బకు దిగిరారా? కానీ అడగలేదు. మాకు పదవులు ముఖ్యం.. కాంట్రాక్టులు ముఖ్యం.. పైరవీలు ముఖ్యం.. నీళ్లు ఎటుపోతేంది.. కరెంటు వస్తేంది.. ఎవరు ఎటుపోతేంది ఇదీ కాంగ్రెస్‌ నేతల వైఖరి’ అంటూ తూర్పారబట్టారు.

CM KCR : గిరిజనులకు పది శాతం రిజర్వేషన్‌.. వారం రోజుల్లో జీవో - NTV Telugu

‘ఒక విషయం మాత్రం బాగా కండ్లారా చూశారు. ఇదే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నడు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాజాప్తా ముఖ్యమంత్రితో అసెంబ్లీలో కొట్లాడుతున్నరు. అడిగిన జవాబు లేక చెప్పే తెలివిలేక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి ఒకమాట అన్నడు. మీరిట్లే మాట్లాడితే.. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మాట్లాడిండు. ఇంత మంది కాంగ్రెస్‌ మంత్రులున్నరే.. అందులో ఒక్కడూ మొగోడు లేకుండనా? ఒక్క తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. మంత్రో.. ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడుతారు.. మేమంతా తెలంగాణ బిడ్డలం.. మా ముందే ఈ మాట అంటవా?.. అని లేచి నిలబడాలి.. అవసరమైతే రాజీనామా మొఖానికి కొట్టాలి. మరి ఎక్కడికిపాయే పౌరుషం.. ఇవాళ హుజూర్‌నగర్‌లో ఓట్లు కావాలి.. నల్లగొండలో ఓట్లు కావాలి.. నాగార్జునసాగర్‌లో ఓట్లు కావాలి.. కానీ తెలంగాణ ప్రజల బాధమాత్రం అవసరం లేదు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా’నన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news