జులై 1 నుంచి ఆన్లైన్ లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జులై ఒకటి నుండి టీచర్లు 50 శాతం హాజరుతో ప్రారంభం చేయాలని పేర్కొన్నారు. 50 శాతం టీచర్లు ఒక రోజు మిగతా 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హాజరు హాజరు కావాలని పేర్కొన్నారు. అలాగే 9 ,10 తరగతులు మాత్రమే ప్రారంభమని… వారికి ఆన్లైన్ తరగతులేనని స్పష్టం చేశారు. 10వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి కూడా సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా అంతకు ముందు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్ టీయూ – టీఎస్ నాయకులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్ లైన్ లోనే విద్యాబోధన కొనసాగించాలని, 50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని వారు సీఎం కెసిఆర్ కు విన్నవించారు.