సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటుతోంది. కానీ ఇంత వరకు ఆయన ఎవరికైనా ప్రతిపక్ష లీడర్‌ను కలిసిన విషయం మనం చూశామా అసలు. కానీ అనూహ్యంగా నిన్న ఓ అరుదైన ఘటన జరిగింది. ఖమ్మం జిల్లాలో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ కావడం రాష్ట్రాన్ని కుదిపేసిందనే చెప్పాలి. దీంతో ప్రతిపక్షాలు మొత్తం విమర్శల దాడి మొదలెట్టాయి.
ఇక ఇదే క్రమంలో టీ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అపాయింట్ మెంట్ కొరకు ట్రై చేశాయి. కానీ ప్రగతి భవన్ మైండ్ ఆడి ముందు టైమ్ లేదని చెప్పింది. కానీ కొద్ది గంటల్లోనే మళ్లీ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడం చూసిన కేసీఆర్ వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో వారంతా ఇదే తమ విజయంగా ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు.
కానీ ఇక్కడే కాంగ్రెస్ నేతలు తొందరపడ్డారని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు. ముందు అపాయింట్మెంట్ లేదన్న కేసీఆర్ తర్వాత ఇవ్వగానే వెళ్లకుండా దాన్ని తిరస్కరించి ఉంటే బాగుండేదన్నారు. కేసీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్ నేతలు కూడా రెండోసారి రమ్మన్నప్పుడు తాము వెళ్లదలచుకోలేదని చెప్పి ప్రెస్ మీట్ నిర్వహించి ఉండాల్సిందని చెబుతున్నారు. అంటే మొత్తానికి కాంగ్రెస్ నేతలు కేసీర్ ఆడిన మైండ్గేమ్ల పావులయ్యారన్న మాట.