దళిత బంధు లబ్దిదారులకు దిమ్మతిరిగే షాక్..ప్రభుత్వ పథకాలు కట్‌ !

-

దళిత బంధు లబ్దిదారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కేసీఆర్‌ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు కింద లబ్ధి పొందిన కుటుంబాలను ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని ఇతర పథకాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ వెబ్ సైట్ లో సాంకేతిక మార్పులు చేస్తోంది. లబ్ధిదారుడి ఆధార్, రేషన్ కార్డు సహాయంతో సాఫ్ట్వేర్ ద్వారా వడపోత ప్రక్రియ పూర్తి చేయనుంది.

దళిత బంధు పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ. 10 లక్షల విలువైన యూనిట్ ను సర్కారు మంజూరు చేస్తోంది. వీటి ద్వారా ఉపాధి పొంది ఆర్థిక సాధికారత సాధించాలన్నది లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 38,476 యూనిట్లు మంజూరయ్యాయి.

వీటిలో 90 శాతం యూనిట్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అందజేసింది. ఇప్పటివరకు రూ.3,300 కోట్లకు పైగా ఈ పథకం కింద వెచ్చించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం ఎమ్మెల్యేల సిఫారసు మేరకు జరుగుతోంది. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి నియోజకవర్గాల వారిగా లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news