బిగ్ స్కెచ్ : మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ లేఖలు

-

మునుగోడు ఉప ఎన్నిక తరుముకొస్తున్న నేపథ్యంలోనే.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక అటు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్లు పరిశీలించనున్నారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడు లో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాయనున్నట్లు సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద సుమారు 3.95 లక్షల మంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు టిఆర్ఎస్ నేతలు గుర్తించారు. వీరందరికీ లేఖలు రాయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని లేఖల్లో కేసీఆర్ కోరనున్నారని తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ ప్రస్తుతం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, గర్భిణులకు కేసీఆర్ కిట్లు, సీఎం రిలీఫ్ ఫండ్, గొర్రెల పంపిణీ, పంట రుణాల మాఫీతో పాటు ఇతర పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతున్నట్లు టిఆర్ఎస్ గుర్తించింది. ఆ లబ్ధిదారులకు కేసీఆర్ లేఖలు రాసేందుకు సిద్ధం అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news