ధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సంచలన నిర్ణయం.. 12వ తేదీ నుంచి ధర్నాలు

-

ధాన్యం కొనుగోలు పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 వ తేదీ నుంచి ధ్యానం కేంద్రం కొనాలని తెలంగాణ రాష్ట్రంలోని నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ బిజేపి పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయని.. అందుకే వరి ధాన్యం కొనుగోలు విషయం బండి సంజయ్ వదిలేశారని ఫైర్ అయ్యారు.

KCR-TRS
KCR-TRS

అందుకే.. తనపై దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. బోర్డర్ కాపాడమంటే దేశ ద్రోహి అంటావా ? ఇలాంటి బ్రోకర్ గాళ్లకు బయపడతానా ? అని మండిపడ్డారు. బిల్ పెట్టినపుడు నీకు పార్లమెంట్ తెలుసా ? రాష్ట్ర సృష్టి కర్త… నన్ను అంటావా ? అని అగ్రహించారు. గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిస్సుగ్గుగా చెప్పారని… గొర్ల పైసలు నిజంగా కేంద్రమే ఇచ్చి ఉంటే నేను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానాని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఎవరు దేశ ద్రోహులు తెలుద్దామనీ.. ధాన్యం పూర్తిగా కొనేదాక వదిలిపెట్టమనీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news