టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

ప్రగతిభవన్ లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది.

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. అలాగే కేంద్రం ఖరారు చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అంశం పైనా కూడా చర్చ జరుగుతోందని సమాచారం. జల వివాదంపై టీఆర్ఎస్‌ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇది ఇలా ఉండగా…రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది.

జల వివాదం నేపథ్యంలో ఒకరి పై మరొకరు నిందలు వేసుకున్నారు ఏపీ మరియు తెలంగాన లీడర్లు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి జల వివాదంపై గెజిట్‌ విడుదల చేసింది. ఇక  ఈ వివాదం ఏ స్థాయికి దాకా వెళుతుందో చూడాలి.