విద్యార్థులకు అలెర్ట్ : ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

కరోనా మహమ్మారి ప్రభావం తో వాయిదా పడుతూ వచ్చిన కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు ఇక నుంచి వరుసగా జరుగనున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసింది విద్యాశాఖ. సెప్టెంబర్ రెండో వారం వరకు వరసగా ఈ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం.

పాలిటెక్నిక్, బాసర ఐఐఐటీ అడ్మిషన్స్ కోసం జులై 17 న పాలిసెట్ పరీక్ష ఉండనుండగా.. జులై 20, 22, 25, 27 తేదీల్లో జేఈఈ మెయిన్ ఉండనుంది. ఇక ఆగస్ట్ 3 న ఈసెట్ పరీక్ష ఉండనుండగా… ఆగస్ట్ 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్షను ప్రభుత్వం నిర్వహించనుంది.  ఆగస్ట్ 9, 10 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ ఉండనుండగా… ఆగస్ట్ 11 నుండి 13 వరకు పిజి ఈసెట్ జరుగనున్నాయి.

ఆగస్ట్ 19, 20 తేదీల్లో ఐసెట్ ఉండనుండగా.. ఆగస్ట్ 23 న లా, మరియు పిజి లా-సెట్ పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఎడ్ సెట్‌ పరీక్ష నిర్వహించనుండగా… ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 2 వరకు జేఈఈ మెయిన్ నాలుగో విడత పరీక్షలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 11 న నీట్ పిజి ఎంట్రెన్స్ పరీక్ష కాగా… సెప్టెంబర్ 12 న నీట్ యూజీ ఎంట్రెన్స్ ఉండనుంది.