తెలంగాణకు మరో 13 అవార్డులు.. సీఎం కేసీఆర్ ప్రశంసలు

-

పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన నేపథ్యంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది శ్రీమతి ముర్ము చేతులమీదుగా న్యూ ఢిల్లీలో సోమవారం ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 థీం ఆధారిత విభాగాల్లో అవార్డుల ఎంపిక జరగగా, 8 విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే అవార్డులను సాధించడం విశేషమని సీఎం తెలిపారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయి. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం.’’ అని సీఎం హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news