శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఈ ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు.
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు.
— Telangana CMO (@TelanganaCMO) August 21, 2020
ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇకపోతే ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. ఇప్పటికే రెస్క్యూ టీం ఐదుగురి మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు మృతదేహాలను తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉండగా వారిలో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు.