అసలు తెలంగాణలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఊహకు కూడా అందట్లేదు. మొన్ననే ఫీవర్ సర్వే నిర్వహించిన ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 3.5లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా కట్టడయ్యేంత వరకు ఇది నిరంతరంగా చేయాలని ఆదేశించింది. ఒక రౌండ్ అయిపోగానే మరో రౌండ్ చేయాలంచూ మార్గదర్శకాలు విడుదల చేసింది. లక్షణాలు ఉన్న పేషెంట్ల వివరాలను ఎప్పటి కప్పుడు అప్‌డేట్ చేయాలంటూ సూచించింది.
అయితే ఇప్పుడు సర్వే చేస్తున్న వారిలో దాదాపు 20శాతం మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కో కార్పొరేషన్‌లో దాదాపు 300మంది సర్వే చేస్తున్నారు. కానీ మళ్లీ ఫీవర్ సర్వే ఎందుకు చేస్తున్నట్టో ప్రభుత్వం చెప్పలేదు. లక్షణాలు ఉన్న వారికి మాత్రం కరోనా కిట్ ఇస్తున్నారు సిబ్బంది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. దీంతో వారికి కరోనా టెస్టు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం టెస్టులు చేయకుండానే లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్లు ఇస్తూ ట్రీట్‌మెంట్ అందిస్తోంది.