అలీ గొప్ప‌మ‌న‌సు.. 130మందికి సాయం

-

ఈ క‌రోనా కార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీ ఎంతగా కుదేలైందో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా షూటింగులు లేక కింది స్థాయి ఆర్టిస్టులు, ప్రొడ‌క్ష‌న్ ఆర్టిస్టులు, అసిస్టెంట్ వ‌ర్క‌ర్ల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. డ‌బ్బుల్లేక పూట గ‌డ‌వ‌ని దారుణ స్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు అగ్ర న‌టులు వారికి సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.

ఇప్ప‌టికే చిరంజీవి, మ‌హేశ్ బాబు లాంటి వారు ముందుకొచ్చారు. ఆప‌ద‌లో ఉన్న వారికి సాయం అందిస్తున్నారు.

అయితే ఇప్పుడు న‌టుడు అలీ కూడా త‌న వంతు సాయం చేయ‌డానికి ముందుకొచ్చాడు. త‌న భార్య‌తో క‌లిసి 130మంది ప్రొడ‌క్ష‌న్ లేడీస్‌కి 8ర‌కాల నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను అందించాడు. ప‌దికిలోల బియ్యం, నూనె, గోధుమ పిండి, చ‌క్కెర‌, ఇత‌ర స‌రుకులు అందులో ఉన్నాయి. త‌న‌వంతుగా సేవ చేస్తున్నాన‌ని, ఇంకా కూడా చేస్తాన‌ని చెప్పాడు. ఎంతైనా అలీ గ్రేట్ క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news