కరోనా మీద దేశం విజయం సాధించింది; కేసీఆర్…!

-

దేశంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని తెలంగాణా సిఎం కేసీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా లాంటి దేశంలో శవాల గుట్టలు ఉన్నాయని అన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపదుతున్నామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా కేంద్రం చెప్పిన సూచనలు పాటిస్తున్నామని అన్నారు.

కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అధ్బుతమైన విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. అమెరికాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.క్వారంటైన్ లో ఉన్న 25 వేల మందిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని కేసీఆర్ అన్నారు. బాధితులు అందరూ క్షేమంగా ఉన్నారని… వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 364 మందికి కరోనా సోకింది అన్నారు. ఫస్ట్ బాధితులు అందరూ క్షేమంగానే ఉన్నారని ఆయన వివరించారు. గాంధీ ఆస్పత్రిలో 3౦8 మందికి కరోనా చికిత్స నడుస్తుంది అని పేర్కొన్నారు.సకాలంలో స్పందించి ట్రీట్మెంట్ కి వచ్చిన వారు అందరికి చికిత్స అందిస్తున్నామని వారు అందరూ క్షేమంగా ఉన్నారని అన్నారు. స్పందించి బయటపడ్డారని పేర్కొన్నారు.

క్వారంటైన్ గడువు ముగిసిన వాళ్ళు ఇళ్ళకు వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు. క్వారంటైన్ లో ఉన్న 50 మందికి కరోనా బయపడింది అని వాళ్ళల్లో ఉన్న 30 మంది విదేశాల నుంచి వచ్చారని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 1089 మందిని గుర్తించామని, క్వారంటైన్ నుంచి రేపు 258 మంది వెళ్లిపోతారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1089 మందిలో 172 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొన్నారు.

93 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటించారు అని వివరించారు. కరోనా పై మనం గణనీయంగా విజయం సాధించారన్నారు. ఢిల్లీ వెళ్ళిన వారి బంధువులకు అంటించారని అన్నారు. కరోనా ప్రపంచానికి పెద్ద పీడా అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.తెలంగాణాలో మరో వంద వరకు పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి పరిక్షా ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. మొత్తం రాష్ట్రంలో 45 మందిడిశ్చార్జ్ అయ్యారు. 11 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు. స్వయం నియంత్రణ, స్వయం క్రమ శిక్షణ పాటించి మనం చాలా సేఫ్ గా ఉన్నామని అన్నారు. లాక్ డౌన్ తో నాలుగు వేల కేసుల దగ్గరే ఆగిపోయామని అన్నారు.

22 దేశాలు కంప్లీట్ గా లాక్ డౌన్ చేశాయని. 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ చేశాయని, అమెరికాలో, యూరప్ లో మాదిరిగా శవాల గుట్టలులేవని అన్నారు. లాక్ డౌన్ ఉండాలని తన అభిప్రాయం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ని ఎత్తివేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక పరిస్థితి చాలా దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని, బతికి ఉంటే బలుసు ఆకు అయినా తిని బ్రతకవచ్చని కేసీఆర్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ మినహా మనకు మరో మార్గం లేదని అన్నారు.

లాక్ డౌన్ ని ఎత్తివేయాలి అంటే అంత ఈజీ కాదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ కొనసాగాలి అనేది తన అభిప్రాయమని అన్నారు. ఇండియా లో లాక్ డౌన్ కొనసాగక తప్పని పరిస్థితి అని కేసీఆర్ అభిప్రాయం పడ్డారు. లాక్ డౌన్ ని శిక్ష లా భావించవద్దు అని ఆయన కోరారు. జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని బోస్టన్ కన్సేల్టింగ్ గ్రూప్ నివేదిక ఇచ్చిందని కేసీఆర్ కీలక వ్యాఖ్య చేసారు.

ప్రధాని అడిగితే లాక్ డౌన్ కొనసాగించాలని తాను చెప్పినట్టు వివరించారు. లాక్ డౌన్ సడలిస్తే అందరూ ఒక్కసారిగా గుమి గూడె ప్రమాదం ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మరణాలు మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేదు అని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. మమ్మల్ని ఎవరో ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు భావించవద్దు అని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ సడలించడం అంటే మామూలు విషయం కాదని కేసీఆర్ అన్నారు.

ప్రధాని దీపాలు వెలిగించాలని కోరితే దాని కొందరు సన్నాసులు వెక్కిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణా ఉద్యమంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించామని అన్నారు. సోషల్ మీడియా యాంటి సోషల్ గా మారిందని కేసీఆర్ మండిపడ్డారు. కవులు తమ సాహిత్యంలో ప్రజల్లో స్ఫూర్తి నింపాలని. డాక్టర్లు వైద్య సిబ్బంది చాలా ఇబ్బంది పడుతూ కూడా పోరాడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా చికిత్సకు 8 ఆస్పత్రులు ఉన్నాయని అన్నారు.

25 వేల మంది వైద్య సిబ్బందిని ఫుల్ రెడీ గా పెట్టుకున్నామని, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపామని అన్నారు. వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు వేతనం ఇస్తున్నామని కేసీఆర్. 16 నుంచి 18 వేల బెడ్స్ ని రెడీ చేసామని కేసీఆర్ చెప్పుకోచ్చారు. పారిశుధ్య కార్మికులకు 5 వేల వరకు అదనపు వేతనం ఇస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తల్లి తండ్రుల తర్వాత పారిశుధ్య కార్మికులు గొప్ప వాళ్ళని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news