తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. సంచలన నిర్ణయాలకు మారుపేరన్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు సీఎం కేసీఆర్ రానున్నారు. ఇవాళ 7:00 సమయంలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం… సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. అయితే ఇవాల్టి మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ ప్రజలతో పాటు విపక్ష నేతలు కూడా చాలా అలర్ట్ అయ్యారు.
మీడియా సమావేశంలో భావిష్యత్తు నిర్ణయాలపై కెసిఆర్ ప్రకటన చేసే అవకశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరిధాన్యం కొనుగోళ్లు, పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు పై మాట్లాడనున్నారు సీఎం కెసిఆర్. ఆర్టీసీ చార్జీల పెంపు పై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను తెలంగాణ రాష్ట్రం లో తగ్గిస్తూన్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిస్తోంది.