దళిత బంధు పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. రెండు వారాల్లో నిధులు విడుదల

దళితుల ఆర్థిక అవసరాల లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆర్థిక సామాజిక వివక్ష ను బద్దలు కొట్టాలనే ఆశయం తో దళిత బంధు పథకo అని సీఎం పునరుద్ఘాటించారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామని సిఎం తెలిపారు. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సిఎం ప్రకటించారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఈ మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని సీఎం స్పష్టం చేశారు.‘‘ దళితబంధు పథకం దేశంలోనే మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్నఆలోచన. ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమే..’’ నన్నారు. పథకాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేసినవారమౌతామని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళితబంధు ను ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్పూర్తే ఇమిడి వున్నదని సిఎం తెలిపారు.