ఈ నెల 23 నుంచి తెలంగాణాలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఉంటుంది అని రాష్ట్ర సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 23 న ధరణిలో సిఎస్ సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు అని కేసీఆర్ ప్రకటించారు. ధరణి ఇప్పటికే సక్సెస్ అయింది అని ఆయన పేర్కొన్నారు. కొన్ని కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నా సరే వాటిని అధిగమిస్తామని సిఎం కేసీఆర్ స్పష్టం చేసారు.
తాజాగా ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు అని ఆయన సూచించారు. కాగా తెలంగాణాలో ధరణి పోర్టల్ ని గత నెల సిఎం కేసీఆర్ ప్రారంభించారు. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఈ పోర్టల్ ని తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.