గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడానికి బిజెపి తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ వరుసగా నేతలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంకానుంది.
ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ తదితర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్న నాయకులు… ప్రచారం ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి అనే దాని మీద కాస్త జాగ్రత్తగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి బిజెపి ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.