ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి : సీఎం కేసీఆర్‌

-

యాదాద్రి ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య దివ్య విమాన గోపుర‌మున‌కు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మ‌నుమ‌డు హిమాన్షు అందించారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. కుటుంబ స‌మేతంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమేనని, ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలు ఉంటాయని, యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయటప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

 

Telangana: CM KCR presents one kg 16 tolas of gold to Yadadri temple

యాదాద్రి టెంపుల్ టౌన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలని, దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. సంబంధించిన 80జీ అనుమతులు వెంటనే తీసుకోవాలని, ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. హెలీపాడ్ ల నిర్మాణం కూడా చేపట్టాలని, యాదాద్రి ఆలయ వైభవానికి అనుగుణంగా వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేటు నిర్మాణాలకు, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news