ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బాట… ధాన్యం కొనుగోలే లక్ష్యంగా ఈనెల 21న మంత్రులుతో కలిసి ఢిల్లీకి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బాట. ఈనెల 21న టీఆర్ఎస్ఎల్పీ భేటీ జరుగనుంది. అదే రోజు సీఎం కేసీఆర్, మంత్రుల టీంతో ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులను కలవనున్నారు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు. ప్రధానం కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంపై చర్చించే అవకాశం ఉంది. యాసంగిలో ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక వేళ కేంద్ర యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందుకు రాకపోతే… ప్రజా పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధం అవుతోంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా.. ఈ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేయనున్నారు. పంజాబ్ తరహాలోనే 100 శాతం తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీ లో ప్రజాప్రతినిధులకు నిరసన కార్యక్రమాలపై దిశానిర్థేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ జరుగుతోంది. ఆకస్మికంగా సీఎం కేసీఆర్ మంత్రులు, సీఎస్ తో భేటీ అయ్యారు. ముఖ్యంగా యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ధాన్యం కొనుగోలు చేయకుంటే.. ఇండియా గేట్ వద్ద ధాన్యాన్ని పారబోస్తాం అని సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news