ఆర్జీవీ టాక్స్ : ద‌ క‌శ్మీర్ ఫైల్స్ పై ఏమ‌న్నారంటే ?

-

దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సంచలనాలను క్రియేట్ చేస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ వేగంగా రూ. 200 కోట్ల కలెక్ట్ చేసేందుకు పయణిస్తోంది. 80,90ల్లో కాశ్మీర్లో చోటు చేసుకున్న కాశ్మీర్ పండిట్ల అణచివేత, అత్యాచారాలు, అఘాయిత్యాలు, వలసపై తీసిన ఈ సినిమా ప్రజాదరణ సొంతం చేసుకుంది. ఏకంగా ప్రధాని మోదీతో పాటు హోమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కాశ్మీర్ ఫైల్ సినిమాను ప్రశంసిస్తున్నారు. విమర్శకులు ప్రశంసలు కూడా పొందుతోంది. మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు సినిమా చూసేందుకు పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు కూడా మంజూరు చేశాయంటే అర్థం చేసుకోవచ్చు ది కాశ్మీర్ ఫైల్స్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందని.

ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ’ సినిమాపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. వరసగా ట్విట్లు చేస్తూ.. సినిమాను తెగపొగుడుతున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పేలుడు పదార్థాల కన్నా ఎక్కువగా ఫైర్ అయ్యారని.. బాలీవుడ్ ను తొక్కేసి సొంతంగా ‘వివేక్ వుడ్’ ను స్థాపించినట్లే. కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్లకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.

కాశ్మీర్ ఫైల్స్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని… సినిమా సృష్టించిన షాక్ వేవ్ బాలీవుడ్‌ను కాశ్మీర్ ఫైల్స్ కు ముందు, తరువాత విభజించింది అని ఆర్జీవీ ట్విట్ చేశారు. ఏ ఫిల్మ్ మేకర్ అయిన ఇక ముందు ఏ సినిమా చేయాలన్నా.. కాశ్మీర్ ఫైల్స్ ను అధ్యయనం చేయాల్సిందే అని ఆర్జీవీ అన్నారు.

నిజాలను బయటకు తీసేందుకు ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం కన్నా సినిమా శక్తివంతమైన సాధనంగా ఉందని కాశ్మీర్ ఫైల్స్ నిరూపించిందని ట్విట్ చేశారు. ఇటీవల కొంతమంది సాధువులు సినిమాకు వెళ్లిన ఫోటోలను షేర్ చేసి ఇది సినిమా మాత్రమే కాదు.. ఇది ఓ విప్లవం అంటూ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news