ట్రెండ్ ఇన్ పోస్ట‌ర్ : గులాబీ ద‌ళ‌ప‌తి మాస్ లుక్ ఎలా ఉందంటే ?

-

కొన్ని జ్ఞాప‌కాలు మ‌ధురం
కొన్ని సంద‌ర్భాలు అతి మ‌ధురం
అందుకే జీవితం ఒక చోట నుంచి మ‌రో చోట‌కు
చేసే ప్ర‌యాణంలో నిన్న‌టి క‌ల‌ల నెర‌వేర్పున‌కు
జ్ఞాప‌కాలే తోడు అవుతాయి..ఊర‌ట నిస్తాయి
కాలం వెన‌క్కు వెళ్తే ఎంత బాగుండు
మ‌న కేసీఆర్ ఆ రోజు ఎలా ఉన్నారో ఇవాళ్టి ట్రెండ్ ఇన్ పోస్ట‌ర్

 

గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌ రావు.ఉద్యమం నుంచి పుట్టిన నేత. 2001 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా బయలు దేరిన సీఎం కేసీఆర్‌..దాదాపు 13 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి… ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఈ 13 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో.. సీఎం కేసీఆర్‌ అనేక ఆటు పోటులు,వెన్నుపోటులు,ఎదురు దెబ్బలు తిన్నారు. అయినా… ఎక్కడా తగ్గేదేలా అన్నట్లు గానే.. ముగ్గురితో పోరాటం మొదలు పెట్టి.. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించారు. ఇచ్చింది కాంగ్రెస్‌ అయినా.. తెచ్చింది మాత్రం కేసీఆరే అనే లెవల్‌ కు వెళ్లింది ఆయన పోరాటం.

 

తెలంగాణ పోరాటాన్నే.. ప్రజలకు వివరిస్తూ… ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చుకున్నాడు ఈ అపర భగీరథుడు. ఈ నేపథ్యంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి..తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి సీఎం గా కేసీఆర్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. మొదటి సారిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ…తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడంతో సఫలం అయ్యారు. ఇదే స్ఫూర్తితో 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి అఖండమైన మెజార్టీని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌… నిధులూ,నియామకాలూ, నీళ్లు అనే విధానంపై పని చేసుకుంటూ ముందుకు వెళ్లారు.వెళ్తున్నారు కూడా! ఆ రోజు ఉద్య‌మానికి ప్రాణ ప్ర‌దంగా నిలిచిన ఈ నినాదం అమ‌లునే త‌న విధానంగా మ‌లుచుకుని దూసుకుపోతున్నారు కూడా! తెలంగాణ రాష్ట్రాన్ని వృద్ధి రేటు అగ్రస్థానంలో నిలుపుకుంటూ.. ప్రతి రూపాయిని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్నారు.

కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి..నీళ్లూ,నిధులూ అనే కాన్సెప్ట్‌ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో అన్ని వర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు వచ్చినా…నిరుద్యోగుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సంబంధిత అసంతృప్తిని నిలువ‌రించేందుకే ఇవాళ అసెంబ్లీ వేదికగా స్వయంగా కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఉద్యోగ విభజన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో 91,142 ఖాళీలు ఉన్నాయమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

వీటిని వెంటనే నోటిఫై చేసి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. కాంట్రాక్ట్ పోస్టులు 11,103 మంది ఉద్యోగులు ఉన్నారని..వారిని పర్మినెంట్ చేస్తున్నామని అన్నారు.దీంతో నిరుద్యోగులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.ముఖ్యంగా ఓయూలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఆరెస్‌ పార్టీ కార్యకర్తల్లో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇదే సంద‌ర్భాన 20 ఏళ్ల కింది నాటి సీఎం కేసీఆర్ ఫొటో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా వింగ్ పోస్టు చేసింది.ఇదే ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ ఫొటోలో సీఎం కేసీఆర్‌ ఓ నల్ల రంగు కోట్‌ వేసుకుని.. పెద్ద కళ్ల జోడులో కనిపించారు.అంతేకాదు..ఆ..ఫొటోలో కేసీఆర్ ఇప్ప‌టి క‌న్నా స‌న్నంగా కనిపిస్తున్నారు. ఉద్యోగాల ప్రకటన వచ్చిన రోజే..ఈ ఫొటో వైరల్‌ గా మారడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

– ట్రెండ్ ఇన్ పోస్ట‌ర్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

 

 

Read more RELATED
Recommended to you

Latest news