షీ వ్యాక్సిన్ కేరాఫ్ మిర్చి స్టేష‌న్

-

టేకాఫ్ పాయింట్
కేరాఫ్ మిర్చి
మిర్చి లాంటి అమ్మాయి

అమ్మాయిలంతా ఏమ‌వుతున్నారు..ఈ స‌మాజాన్ని మార్చే శ‌క్తి మూర్తులు అవుతున్నారు..స్త్రీ మూర్తే ఇమ్యూనిటీ బూస్ట‌ర్ అని అంటోంది రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం ఛానెల్..షీ వ్యాక్సిన్ అంటూ నిన్న‌టి వేళ సంద‌డి చేసిన వైనం ఇప్పుడు మ‌రింతగా నెటిజ‌న్లను ఆలోచింప‌జేస్తోంది.ఎఫ్ఎం అంటే కేవ‌లం వినోదం కాదు బాధ్య‌త కూడా అని నిరూపించింది.తెలంగాణ వాకిట మ‌రియు ఆంధ్రాలోనూ..న‌గ‌ర జీవ‌న గ‌తిలో అత్యంత ప్ర‌భావ‌శీల‌కంగా నిలిచిన మ‌హిళ విజ‌య గాధ‌ల‌ను మ‌రోమారు ప‌రిచ‌యం చేసి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.

షీ వ్యాక్సిన్..ఈ పేరు వినండి మ‌రో సారి అనండి..స‌మాజ ద‌శ‌నూ దిశ‌నూ మార్చే ఓ ప్ర‌య‌త్నం నిన్న‌టి వేళ..ఓ మగువా నీకు వంద‌నం..ఓ ముగ్ధా నీకు అభివంద‌నం అంటూ..ప‌దే ప‌దే చెబుతున్న ఈ వైనం ఆకాశ వాణి దారుల్లో ఓ పెను మార్పు..ఆధునిక శ‌కాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఎఫ్ఎం వేదిక‌ల్లో మ‌రో గొప్ప కూర్పు.వినండి..కోపం వ‌స్తే మిర్చిలాంటి అమ్మాయే కానీ కొన్ని సంద‌ర్భాల్లో కారుణ్యానికి ప్ర‌తీక కూడా ! ఆ క‌థ‌నం ఆ వివ‌రం సంక్షిప్తం చేస్తే ..నిక్షిప్తం చేస్తే..షీ వ్యాక్సిన్..కేరాఫ్ రేడియో మిర్చి స్టేష‌న్.

మహిళలు త‌మ జీవితంలో వాళ్లు ఎదుర్కొనే భయాలు,నిర్వ‌ర్తించే బాధ్యతలు,అనుభ‌వించే ప్రేమలు, కొనసాగించే అనుబంధాలు ఇలా ఒక్క‌టేంటి అన్ని విషయాలపై మహిళా ఆర్జేలు మాట్లాడారు. హైదరాబాద్, వరంగల్ ఎఫ్ఎం స్టేషన్ల నుంచి ఆర్జే అమృత, ఆర్జే భార్గవి, ఆర్జే స్వాతి, ఆర్జే శ్వేత నిన్న‌టి వేళ విమెన్స్ డే సంద‌ర్భంగా రోజంతా కార్యక్రమాలు నిర్వహించారు. అదే రీతిన వైజాగ్, విజయవాడ ఎఫ్ఎం స్టేషన్ల‌ నుంచి ఆర్జే అనుశ్రీ, ఆర్జే ఇందు,ఆర్జే కావ్యశ్రీ తమదైన శైలిలో మాట్లాడుతూ స్ఫూర్తిదాయక క‌థ‌నాలు వివ‌రిస్తూ..విశ్లేషిస్తూ..శ్రోతలలో న‌వోత్తేజం నింపారు.సీఆర్పీఎఫ్ లో పని చేసే తెగువ గ‌ల మగువ మొదలుకొని…పది రూపాయలకు 5 ఇడ్లీలు అమ్మే మహిళా సేవా మూర్తి వరకు పలువురు స్ఫూర్తి ప్రదాతలను శ్రోతలకు పరిచయం చేశారు.

– వేణు గోపాల్ – మ‌న లోకం ప్ర‌త్యేకం
ఇన్ పుట్ సోర్స్ : ధీర‌జ్ అప్పాజి

Read more RELATED
Recommended to you

Latest news