నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియోకాన్స‌రెన్స్..కార‌ణం ఇదే..!

-

నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హిస్తున్నారు. ఈ సంధ‌ర్భంగా కేసీఆర్ క్వారంటైన్, టెస్టులపై ఆరా తీయ‌నున్నారు. అంతే కాకుండా కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం ఆరా తీయ‌నున్నారు. కొత్త వేరియంట్ ఒమెక్రాన్ పరిస్థితులపై సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో చ‌ర్చించ‌నున్నారు. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలు. వారిలో ఎవరికైనా పాజిటివ్ తేలిందా? రెండోసారి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారా? వంటి విషయా లను పై వివరణ కోరే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అన్ని జిల్లాల్లోని ఆర్టీపీసీఆర్ కేంద్రాలను తిరిగి పునరుద్ధరించాలని సీఎం ఆదేశాలు ఇవ్వనున్నట్టు స‌మాచారం. వాటికి కావాల్సిన కిట్లు, రియోజెంట్లను ఇవ్వాల్సిందిగా వైద్యశాఖకు సూచించనున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ప్రతిరోజు జిల్లా కేంద్రాల్లో మూడు వందల మందికి ఆర్టీపీసీఆర్ విధానంలో టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news