అతి పిన్న వయస్కుడైన సీఈఓగా పరాగ్‌ అగర్వాల్

-

ట్విట్టర్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ ఎస్‌అండ్ పీ 500లో అతి పిన్న వయస్కుడైన సీఈఓ‌గా నిలిచారు.

ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి జాక్ డోర్సీ వైదొలగడంతో ఆయన వారసుడిగా ఎంపికైన పరాగ్ వయస్సు కేవలం 37 సంవత్సరాలు. ప్రస్తుతం మెటా ప్లాట్‌ఫార్మ్స్ (ఫేస్‌బుక్) వయస్సు కూడా ఇంతే కావడం గమనార్హం. భద్రతా కారణాల రీత్యా కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ వయస్సును ట్విట్టర్ బయటకు వెల్లడించలేదు. కానీ, జూకర్ బర్గ్ జన్మించిన మే 14, 1984 తర్వాతనే పరాగ్ పుట్టినట్లుగా ధ్రువీకరణ అయింది. అమెరికాలోని అతి పెద్ద కంపెనీలకు చెందిన 12 మంది యంగెస్ట్ సీఈఓలలో జాక్ డోర్సీ(45) ఒకరుగా ఉన్నారు.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఎస్‌అండ్‌పీ 500 కంపెనీలలో అత్యంత పెద్ద వయస్కుడైన సీఈఓగా బెర్క్‌షైర్ హాత్‌వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారెన్ బఫెట్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన 91 సంవత్సరాలు. ప్రపంచంలోనే అతి పెద్ద 500 కంపెనీల సీఈఓల సగటు వయస్సు 58 సంవత్సరాలు. కానీ, ఇప్పటికీ సీఈఓలలో నియామకాల్లో యువతకు ఇంకా అవసరమైనన్ని అవకాశాలు దక్కడం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news