డిసెంబ‌ర్ 4న పాల‌మూరుకు సీఎం కేసీఆర్

-

పాల‌మూరు జిల్లా కేంద్రంలో నూత‌నంగా నిర్మించిన క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 4వ తేదీన నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్లడించారు. స‌భ ఏర్పాట్ల‌పై పార్టీ శ్రేణులు, అధికారుల‌తో చ‌ర్చించారు.

కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారని అన్నారు.

రాష్ట్రం రాకముందు ఎంవీఎస్ కళాశాల గ్రౌండ్‌లో స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమావేశం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అక్కడే రాష్ట్రం ఏర్పడ్డాక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణకే సాధ్యమైందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news