త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ : సీఎం కేసీఆర్‌

-

ముస్లిం సోదరులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ బక్రీద్‌. అయితే ఈ ఏడాది బక్రీద్‌ పండుగ జులై 10వ తేదీన రావడంతో ఇప్పటికే ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ, బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా)(జూలై10) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

Conduct revenue meetings to address land related issues, CM KCR to officials

భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవుని పై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తున్నదని సీఎం కేసిఆర్ అన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news