ఉత్తరప్రదేశ్‌లోని చంపావత్ ఉప ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయ ఢంకా మోగించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థిపై 55,000 ఓట్ల మెజారిటీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా గహ్తోరికి డిపాజిట్లు కూడా రాలేదు. కాగా, ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి సీఎం పుష్కర్ సింగ్ ఓడిపోయారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అయింది.
మే 31వ తేదీన ఉత్తరాఖండ్, కేరళ, ఒడిశాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెలువడ్డాయి. భారీ మెజార్టీతో సీఎం పుష్కర్ సింగ్ గెలవడంతో.. ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి సీఎం పుష్కర్ సింగ్ మరింతగా కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. కాగా, చంపావత్ ఉప ఎన్నికలపై సీఎం పుష్కర్ సింగ్ ఎమోషనల్ ట్విట్ చేశారు. ప్రజలు చూపించిన ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు.