బాలీవుడ్ నటి నుష్రత్ భరుచా నటించిన తాజా చిత్రం ‘జన్ హిత్ మే జారీ’. ఈ నెల 10న పిక్చర్ రిలీజ్ కానుంది. ఇందులో కండోమ్ వాడకం, చట్టవిరుద్ధమైన అబార్షన్, స్త్రీల కష్టాలపై చర్చించారు.ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ లో తాజాగా నుష్రత్ ఓపెన్ కామెంట్స్ చేసింది.
నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నానని స్పష్టం చేసింది నుష్రత్. గ్రామాల్లోనే కాకుండా నగరాల్లోనూ నేటి తరం కండోమ్ పట్ల అవగాహన కలిగి లేరని తెలిపింది. శృంగారం సమయంలో కండోమ్ ఉపయోగించడం పురుషుల కన్న స్త్రీలకే చాలా ముఖ్యమని అభిప్రాయపడింది.
సొసైటీలో కొందరు అపరిచిత మహిళలతో శృంగారంలో పాల్గొంటున్నారని, ఆ సమయంలో వారు కండోమ్ ధరించకపోవడం వలన స్త్రీల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై విమర్శలు చేసే ముందర కండోమ్ ప్రయారిటీని తెలుసుకోవాలని సూచించింది. ‘జన్ హిత్ మే జారీ’ చిత్రంలో కండోమ్ ప్రచారకురాలిగా నుష్రత్ కనిపించనుంది.