‘సర్కారు వారి పాట’ OTTలోకి వచ్చేసింది..కానీ కండీషన్స్ అప్లై..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల విడుదలై సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కాగా, అప్పుడే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేసింది. కానీ, సినిమా చూడాలంటే ఓటీటీ సబ్ స్క్రైబర్స్ సైతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్స్ లో పే పర్ వ్యూ మోడల్ లో డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుంది. రూ.199 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో…బ్యాంకింగ్ నేపథ్యంలో జరిగే విషయాలపై అద్భుతంగా చర్చించారు.

‘మహానటి’ కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఇందులో మహేశ్ కామెడీ టైమింగ్, యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. సముద్రఖని కీలక పాత్ర పోషించగా, కీర్తి సురేశ్-మహేశ్ బాబు మధ్య లవ్ స్టోరి , ట్రాక్ కూడా బాగా వర్కవుట్ అయింది. ఇక ఎస్.ఎస్.థమన్ అందించిన మ్యూజిక్ హైలైట్ అయింది. ఇటీవల ‘మురారీ బావ’ సాంగ్ ను థియేటర్స్ లో జోడించారు.

Read more RELATED
Recommended to you

Latest news