లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తాజా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా సవాల్కి ప్రతి సవాల్ విసురుకుంటున్నారు.తాజాగా మరోసారి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ నేత , ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”నాకు పదవులు కాదు.. రైతుల ప్రయోజనాలు ముఖ్యం. నాడు ఓటుకు నోటు.. నేడు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తారో లేదో చెప్పాలి. హామీలు అమలయ్యే వరకూ పోరాటం చేస్తూనే ఉంటా అని అన్నారు. సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని సీఎం చెబుతున్నారు. జిల్లాలు ఉండాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి” అని హరీష్ రావు పిలుపునిచ్చారు.