కర్ణాటక క్యాబినెట్ లోకి ఏడుగురు కొత్త మంత్రులు.. ఎవరెవరంటే ?

కర్ణాటక కాబినెట్ లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్తగా మంత్రి మండలిలో ఏడుగురికి చోటు కల్పిస్తున్నారు. ఈమేరకు ఏడుగురి పేర్లను గవర్నర్ కు ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పంపినట్లు సమాచారం అందుతోంది. ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉండే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా మంత్రి వర్గంలో చేరే వారి పేర్లు ఈ మేరకు ఉన్నాయి.

ఎం టి బీ నాగరాజు, ఉమేష్ కట్టి, అరవింద్, మురుగేష్ నిరాని, ఆర్ శంకర్, యోగేశ్వర్, అంగర లకు కాబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అలానే ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న ఇద్దరు బీజేపీ నేతలను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఈ క్యాబినెట్ కూర్పునకు కు సంబంధించి హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎడ్యూరప్ప సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఏడుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని ఆయన ప్రకటన చేశారు.