ఏపీ సీఎం జగన్.. నుంచి అవకాశం రావడమే పెద్ద సంచలనంగా మారింది. అలాంటిది ఆయన ఇప్పుడు ఇచ్చిన అవకాశం మరింత భారీగా ఉండడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దూసుకుపోవాలని భావించిన వారు చాలా మంది ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 14 నెలలోనే అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అనేక రూపాల్లో ప్రజలకు చేరువయ్యారు. దీంతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైంది. ఇక, ఇప్పుడు ప్రవేశ పెట్టిన కీలకమైన పథకం.. మరింతగా ప్రజలకు మేలు చేస్తుందని అంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని తాజాగా జగన్ ప్రారంభించారు. 46 ఏళ్లు దాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు.. ఆర్థికంగా ఎదిగేలా.. వారికి అన్ని విధాలా ఆదుకునేందుకు జగన్ ఈ పథకాన్ని తెరమీదికి తెచ్చారు. ప్రస్తుతం ఆయా వర్గాలకు చెందిన మహిళలు ఓ వయసుకు వచ్చిన తర్వాత.. కుటుంబంలో ఆదరణ కోల్పోతున్నారు. పోనీ సొంతకాళ్లపై నిలబడాలన్నా.. కూడా వారికి అప్పుడు లభించే ఆదరణ అంతంత మాత్రమే.
ఈ క్రమంలోనే ఆయా వర్గాలకు చెందిన మహిళలు.. ప్రబుత్వం నుంచి తమకు కూడా ఏదైనా ఆదరణ లభించేకార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే , గత ప్రభుత్వాలు ఈ మహిళల మొరను ఆలకించలేదు. దీంతో జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకు చేరువైనప్పుడు వారి నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్ ఇదే. 46 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా లభించేలా చూడాలన్న వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జగన్.. కేవలం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే వైఎస్సార్ చేయూతను తెరమీదికి తెచ్చారు.
ఏటా మహిళలకు 18750 రూపాయలను వారి వారి ఖాతాల్లో వేయనున్నారు. అంతేకాదు, వారికి పెట్టుబడులుగా వినియోగించే సొమ్ముతో పాటు అమూల్, రిలయన్స్, ప్రొక్టర్ అండ్ గేంబెల్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా మహిళల జీవితాల్లో వెలుగులు ఖాయమని అంటున్నారు పరిశీలకులు.