క్రిమి సంహారక సొరంగాల బ్యాన్ పై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్ట్

-

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న క్రిమిసంహారక సొరంగాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​పై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ టన్నెళ్ల వాడకం, ఉత్పత్తి, ప్రచారం సహా వీటిని ఏర్పాటు చేయడాన్ని తక్షణమే నిషేధించాలన్న పిటిషన్​ పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్​ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు స్పందించింది.

supreme
supreme

ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంకేతిక శాఖ, వ్యవసాయ శాఖకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గుర్​ సిమ్రన్ సింగ్ నరులా అనే న్యాయ విద్యార్థి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. మనుషులపై ఉన్న క్రిములను సంహరించే పేరుతో పురుగుల మందులను చల్లడం నిషేధించాలని పిటిషనర్ కోరారు. వాటి ఉత్పత్తి, వాడకం సైతం నిలిపివేయాలని అభ్యర్థించారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక రకాల క్రిమిసంహారక పరికరాలు బయటకు వచ్చాయని, ఇవి వైరస్​ను నియంత్రిస్తాయని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. డబ్ల్యూహెచ్​ఓ సహా ఇతర ప్రామాణిక సంస్థలు వీటి ప్రమాదకరమైన ప్రభావం గురించి హెచ్చరించాయని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news