అమరావతి : నేడు నెల్లూరులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే… ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉదయం 11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్నారు.
అనంతరం గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం.. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్.
అయితే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… నెల్లూరు పర్యటన నేపథ్యంలో.. ఆ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా.. చూస్తున్నారు అధికారులు. ఇక మధ్యాహ్నం.. ఏపీ మంత్రులతో సీఎం జగన్.. కీలక సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉంది.