ఏపీ అసెంబ్లీలో ఆర్థిక ప‌రిస్థితిపై కాగ్ నివేదిక…!

-

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై కాగ్ రిపోర్ట్ ను ప్ర‌క‌టించారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ తీవ్రంగా పేర్కింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి.. త‌ర్వాత జూన్ 2020లో శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దని నివేధిక పేర్కొంది.రాజ్యాంగ నిబంధ నలకు వ్య‌తిరేకంగా ఆర్థిక వ్య‌వ‌హారాలు జ‌రిగాయని పేర్కొంది.

చ‌ట్టస‌భ‌ల ఆమోద ప్ర‌క్రియ‌ను, బ‌డ్జెట్ మీద అదుపును బ‌ల‌హీన‌ ప‌రిచారని ఆరోపించింది. ప్ర‌జా వ‌న‌రుల వినియోగ నిర్వ‌హ‌ణ‌లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యాన్ని ప్రోత్స‌హించారని ఆరోపించింది. శాస‌న స‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసే సంద‌ర్భాలు పున‌రావృతం అవుతున్నాయని ఆరోప‌ణ‌లు చేసింది. అద‌న‌పు నిధులు ఆవ‌శ్య‌కం అని భావిస్తే…శాస‌న స‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని పేర్కొంది. గత ఐదేళ్ల నుంచి చెబుతున్నా మార్పు రావడం లేదని నివేధిక పేర్కొంది. శాన‌స వ్య‌వ‌స్థను నీరు గార్చేలా… నిధుల నిర్వ‌హ‌ణ ఉంద‌ని నివేధిక‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news