తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్

-

తమిళనాడును వర్షాలు వదలడం లేదు. మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ తమిళనాడు జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు రాజధాని చెన్నైని కూడా వర్షాలు వదలడవం లేదు. గత నెల రోజులుగా బంగాళాఖాతంలో వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడుతుండటం, ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శుక్రవారం తమిళనాడులోని రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, పుదుకోట్టై, నాగపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గురువారం తూత్తుకుడిలో సాయంత్రం వరకు ఏకంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, శుక్రవారం ఉదయం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుత్తుకుడికి వెళ్లే విమానాలను దారి మళ్లిస్తున్నారు.

ఇదిలా ఉండగా శుక్ర, శనివారాల్లో చెన్నైకి ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. చెన్నై, నాగపట్నం, తిరుచ్చి, తిరువారూర్, వెల్లూరు, పుదుకోట్టై, విరుదునగర్, అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, విల్లుపురం, మైలదుతురై, తిరువణ్ణామలై, కాంచీపురం, కళ్లకురుచ్చి జిల్లాల అధికారులు పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news