చలితో వణికిపోతున్న తెలంగాణ జనం

-

తెలంగాణను ఓ వైపు పొగమంచు కమ్మేస్తోంటే.. మరోవైపు చలి ప్రజలను తెగ వణికిస్తోంది. ఈశాన్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రివేళల్లో అయితే చలికి రోడ్లపై జనసంచారం తగ్గింది. బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే అభాగ్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 4.6 డిగ్రీలు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. ఇవాళ, రేపు పగలు పొడిగా, రాత్రిపూట చలి వాతావరణం ఉంటుందని గాలిలో తేమ పేరిగి ఉదయం పూట అధికంగా మంచు కురుస్తోందని వాతావరణ శాఖ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news