శ్రీశైలం ఘటన మీద దర్యాప్తుకు జెన్కో ఇంటర్నల్ కమిటీ !

-

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఘోర‌ ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించింది. ప్రమాదం, 9మంది ఉద్యోగుల‌ మృతిపై స్థానిక ఈగలపెంట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు శుక్రవారం రాత్రి సీఐడీకి బదిలీ అయింది. ఇక ఘటన మీద జెన్కో కూడా ఇంటర్నల్ కమిటీ వేసింది. టీఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి అధ్యక్షతన 4గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

సీఐడీతో సంబంధం లేకుండా వీరు ఘటన మీద ప్రత్యేక దర్యాప్తు చేయనున్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జెన్కో సిఎండి ప్రభాకర్ రావు వీరిని అదేశించారు. ఇక పొగ కారణంగా ఆక్సిజన్ లభించకే వారు చనిపోయారని చెబుతున్నారు. ఇంకా లోనికి వెళ్లడానికి కుదరడం లేదని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఈ కమిటీలో సభ్యులుగా శ్రీనివాసరావు (జేఎండి), జగత్ రెడ్డి (ట్రాన్స్మిషన్ డైరెక్టర్), సచ్చిదానందం (ప్రాజెక్టు డైరెక్టర్ టీఎస్ జెన్కో), రత్నాకర్ (కన్వీనర్) లు ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news