కర్నూలు: ఆరు సీట్లలో హోరాహోరీ!

-

కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట…ఇక్కడ వైసీపీ వన్ సైడ్ గా గెలవడమే తప్ప ఓడిపోవడం ఉండదు..ఓవరాల్ గా జిల్లాపై వైసీపీకి గట్టి పట్టు ఉంది..ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీ హవా కొనసాగుతుంది..గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం మారుతుంది…గత ఎన్నికల్లో అంటే టీడీపీపై వ్యతిరేకత ఉంది…అలాగే జగన్ వేవ్ ఉంది…జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడం బాగా ప్లస్ అయింది.

అందుకే గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది…కానీ ఇప్పుడు పరిస్తితి అలా లేదు..వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది…అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుంది..అలా అని జిల్లాలో పూర్తి స్థాయిలో వైసీపీ బలం తగ్గలేదు గత ఎన్నికల్లో 100 శాతం ఫలితాలు సాధించింది…ఈ సారి మాత్రం 70 శాతం వరకు విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది.

ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఇదే స్పష్టమైంది…తాజాగా కర్నూలుకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే 14 సీట్లు ఉన్న కర్నూలుల వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఆరు ఉన్నాయి. శ్రీశైలం, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు, ఆదోని, పాణ్యం సీట్లు ఉన్నాయి. ఈ ఆరు చోట్ల వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు రెండు..కర్నూలు సిటీ, బనగానపల్లె సీట్లని టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరు చోట్ల రెండు పార్టీల మధ్య టఫ్ ఉంటుందని తెలిసింది. నంద్యాల, ఆళ్లగడ్డ, మంత్రాలయం, డోన్, ఆలూరు, పత్తికొండ సీట్లలో హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. వీటిల్లో డోన్, ఆళ్లగడ్డ, నంద్యాలలో కాస్త వైసీపీకి ఎడ్జ్ ఉండగా, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం సీట్లలో టీడీపీకి ఎడ్జ్ ఉందని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news