కంప్యూటర్ వలన కళ్ళు స్ట్రైన్ అవుతున్నాయా..? అయితే బెస్ట్ టిప్స్ మీకోసం..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్ల ముందు కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేస్తున్నారు. ఎక్కువ సేపు ఇలా పని చేయడం వలన కళ్ళు స్ట్రైన్ అవుతుంటాయి అలానే నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు వంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలను పాటిస్తే సరి.

కంప్యూటర్ వలన కళ్ళు స్ట్రెయిన్ అవుతుంటే ఇలా చెయ్యండి:

బ్రేక్ తీసుకోండి:

మీరు కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కోర్చోవద్దు. మధ్య మధ్య లో బ్రేక్ తీసుకోవడం వలన ఈ సమస్య కలగదు. కంటికి రెస్ట్ దొరుకుతుంది.

వార్మ్ కంప్రెస్:

మీరు కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపినా లేదంటే ఎక్కువగా పుస్తకాలను చదువుతున్నా వార్మ్ కంప్రెస్ ని వాడండి దీని కోసం మీరు ఒక శుభ్రమైన క్లాత్ ని తీసుకుని గోరు వెచ్చని నీళ్లలో పెట్టి కంటి మీద పెట్టండి. ఇలా చేయడం వలన కళ్ళకి ఇబ్బందే ఉండదు. స్ట్రెయిన్ అవ్వదు.

ఐ మసాజ్:

ఐ మసాజ్ ను చేయడం వలన కూడా మీరు సమస్య నుండి బయటపడడానికి అవుతుంది దీని కోసం మీరు ఆలివ్ ఆయిల్ అలోవెరా జెల్ లేదంటే ఐ క్రీమ్ ని ఉపయోగించవచ్చు.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్ ని మీరు కంటి మీద అప్లై చేయడం వలన కూడా చక్కగా రిలీఫ్ ని పొందవచ్చు. కంప్యూటర్ వలన కళ్ళు స్ట్రెయిన్ అవుతుంటే ఇలా కూడా మీరు చెయ్యచ్చు. సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news