సమంత మీద నమ్మకమా లేక కథ మీద నమ్మకమా.!

-

సమంత కొత్త సినిమా యశోద ఫలితం పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అనే సరికి అందరూ అంత బడ్జెట్ పెట్టారా అని ఆశ్చర్యపోయారు. ఇది సమంత మీద కాన్ఫిడెన్స్ వుండి పెట్టారా లేక కథ మీద నమ్మకమా అని ఆలోచిస్తున్నారట. కాని ఈ సినిమా పై నిర్మాత  చాలా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది .

దీనికి మేకర్స్ తమ అంచనా ప్రకారం మామూలు హీరోలతో సమంత నటించిన చిత్రాలు 50 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. అదీ కాక  ‘పుష్ప’ ఐటెం సాంగ్ మరియు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కారణంగా సామ్ కు పాన్ ఇండియా వైడ్ గుర్తింపు వచ్చింది. ఇవన్నీ ఆలోచించి ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో బడ్జెట్ ఎక్కువ పెట్టారట..

ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం.. నాన్ థియేట్రికల్ హక్కులకు  30 కోట్లకు పైగానే వచ్చిందట.అది కూడా డిజిటల్ రైట్స్ – రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు మరియు ఓవర్ సీస్ అమ్మడం ద్వారానే వచ్చాయని అంటున్నారు. ఇక మిగిలిన భాషల ద్వారా వచ్చే వసూళ్ల లెక్కల తో సినిమా సేఫ్ అవుతుంది అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news