రేవంత్ రెడ్డి సర్కార్ కు హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్..!

-

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. కేవలం సన్న వడ్లకే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాకు రూ.500ల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మాటిచ్చినట్లుగా రైతులకు బోనస్ అమలు చేయకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం హరీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు హరీష్ రావును కలిశారు.

జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు ఆయనకు చెప్పారు.. దీంతో వెంటనే రైతుల ఫోన్ నుండి తల్లాడ అగ్రికల్చర్ ఆఫీసర్కు ఫోన్ చేసిన హరీష్ రావు మాట్లాడారు. రైతులకు జీలుగు విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఏవోను ప్రశ్నించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. పవర్ లోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ.2 లక్షల మాఫీ అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని ఫైర్ అయ్యారు. ధాన్యానికి ఇస్తానన్న బోనస్ ఇప్పటికీ అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news