మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు దశాబ్దకాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు…తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రం పరువు తీశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అధికారులను మార్చిందని దుయ్యబట్టారు.
తమను రాష్ట్రంలో ప్రజలు రిజెక్ట్ చేయలేదని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 సీట్లు వచ్చాయని తెలిపారు. కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు కేసిఆర్. మూడు కోట్ల ఓట్లలో తమ పార్టీకి కోటికి పైగా ఓట్లు పడ్డాయన్నారు. అనుకోకుండా జరిగిన పరిణామంలో కాంగ్రెస్కు అధికారం వచ్చిందని,అధికారం ఇచ్చినపుడు బాధ్యతగా వ్యవహరించాలని కేసిఆర్ సూచించారు.