హుజరాబాద్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. తెలంగాణ లోనే కాదు.. ఢిల్లీ వెళ్లినా మా తీరు మారదని స్ఫష్టం చేస్తుంది నేతల ప్రవర్తణ. ఏఐసీసీ ప్రతినిధుల ముందే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. కాగా తాజాగా హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అత్యంత తక్కువ ఓటు పర్సెంటేజీ వచ్చిందని.. ఇక్కడ కన్నా పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ లేని ఏపీలో 6 వేల ఓట్లు వస్తే.. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఓటమిపై అధిష్టానం ఆవేదనలో ఉంది అన్నారు.
మేం లేటుగా ప్రచారం ప్రారంభించామని.. అభ్యర్థి ఎంపిక కూడా లేట్ చేశామని ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయి. సంప్రదాయంగా ఉండే కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. ఇందిరమ్మ ఓటు బ్యాంకు ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు. మాకు ఓటు వేస్తామని హామీ ఇచ్చిన ప్రజల ఓట్లు కూడా పడలేదని అన్నారు. గతంలో సెకండ్ స్థానంలో ఉండే.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయామని అన్నారు. 2023లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో కొట్లాడాలంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.