కాంగ్రెస్ నేతలపై పొన్నం సంచలన వ్యాఖ్యలు.. అధిష్టానం ముందే ఆగ్రహం

వేదిక మారిని టీ కాంగ్రెస్ లో పోరు ఆగడం లేదు. తాజాగా ఢిల్లీలో కూడా విభేదాలు కనిపించాయి. హుజూరాబాద్ ఓటమిపై సమీక్షించేందుకు టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయ్యారు. సమన్వయం కోసం వెళ్లి మళ్లీ ఒకరిపై ఒకరు ఆరోపణలు  చేసుకున్నారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షడులుగా పనిచేసిన కే. కేశవ రావు, డి. శ్రీనివాస్ లు రాజ్య సభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని అన్నారు.

మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం ఫైర్ అయ్యారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ వెనకబడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్‌ విసిరారు. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.