సోషల్ మీడియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోపు అని అందరికీ తెలిసిందే…అయితే దీనిని తీవ్రంగా ఖండిస్తోంది హస్తం పార్టీ. యూట్యూబ్‌లో ఇటీవల రాహుల్‌గాంధీ వీడియోలనే దేశప్రజలు ఎక్కువగా చూస్తున్నారని అంటున్నారు. ఈ మధ్య అంతర్జాతీయంగా కూడా రాహుల్‌కు అభిమానులు పెరిగారని ప్రధాని మోడీకి ఆదరణ తగ్గుతోందని వాదిస్తున్నారు. అసలు ప్రధాని మోడీతో రాహుల్‌గాంధీకి పోలికా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రధాని మోదీ ప్రపంచ నాయకుడిగా మారిపోయారని, అగ్రదేశాల్లోని పాలకులే మోదీని ఫాలో అవుతున్నారని నివేదికలు నిరూపిస్తున్నాయి.మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు ఇంతలా వాదిస్తున్నారు. రాహుల్‌గాంధీకి పాపులారిటీ పెంచేందుకు ఇలా మాట్లాడుతున్నారా అని మరికొందరి వాదన
ప్రధాని మోదీకి ట్విట్టర్‌లో 9.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఉన్నది కేవలం 3.7 కోట్ల మంది ఫాలోవర్లు మాత్రమే.భారత ప్రధాని మోదీ తర్వాత అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా తర్వాతి స్థానాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(3.3 కోట్లు), ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత-ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ (2.7 కోట్లు) ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి 2.5 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. వీరందరి తర్వాత 5వ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీకి ఉన్న ఫాలోవర్లు 2.4 కోట్ల మంది మాత్రమే.
ఇదే ప్రమాణికంగా తీసుకుంటే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న తేడా ఒక్క ట్విట్టర్‌లోనే భారగీ కనిపిస్తోంది. హస్తం పార్టీ చెప్తున్నట్టు యూట్యూబ్ విషయానికి వస్తే.. ప్రధాని మోదీకి 1.6 కోట్ల మంది ఫాలోవర్లు, రాహుల్ గాంధీకి 26 లక్షల మంది ఫాలోవర్లు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీకి 7.7 కోట్ల మంది, రాహుల్‌కి 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీకి 4.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, రాహుల్‌ని 66 లక్షల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. దీనినిబట్టి చూస్తే రాహుల్‌గాంధీ విషయంలో కాంగ్రెస్ కామెంట్లు హాస్యస్పదమని తేలిపోతున్నాయి.
మొత్తంగా ప్రధాని మోదీకి 3 బిలియన్ల వీక్షణలు లభించగా, రాహుల్ గాంధీకి కేవలం 400 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. రాహుల్ గాంధీ వీడియోలను యూట్యూబ్‌లో 25 కోట్ల మంది వీక్షించగా, ఈ ఒక్క ఏడాదే ప్రధాని మోదీ వీడియోలకు 76 కోట్ల యూట్యూబ్ వీక్షణలు దాటాయి.ఇదిలా ఉండగా రాజకీయాల్లో ఏ నాయకుడికి అయినా నిజమైన బలం అధిక మంది ఓటర్లను కలిగి ఉండటం.2014,2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన ఓట్లే అందుకు ఉదాహరణ. అసలు సోషల్ మీడియాలో ఇరువురికి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సామర్ధ్యాలను పోల్చడం అర్ధం లేనిదని కొట్టిపారేసేవారు చాలామందే ఉన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే వేదిక ఏదైనా మోడీ కంటే తోపు ఎవ్వరూ లేరనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌కి చెప్తున్నది కూడా ఇదే..